బాలికను వేధిస్తున్న బాలుడిపై కేసు

ABN , First Publish Date - 2020-06-26T10:03:04+05:30 IST

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బాలుడిపై కేసు నమోదు చేసిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఓ బాలికను

బాలికను వేధిస్తున్న బాలుడిపై కేసు

బంట్వారం : బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బాలుడిపై కేసు నమోదు చేసిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఓ బాలికను గత కొంత కాలంగా ఓ బాలుడు(18) ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడి వేధిస్తున్నాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు మండల పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న మేనమామ దగ్గర బాలికను పంపించారు. విషయాన్ని తెలుసుకున్న బాలుడు స్కార్పియో వాహనం తీసుకుని గ్రామానికి వెళ్లి బాలిక చేయిపట్టి లాగాడు. వెంటనే గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో బాలుడు అక్కడి నుంచి పారిపోయారు. బాలిక మేనమామ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-06-26T10:03:04+05:30 IST