ఉమ్మడి జిల్లాలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-09-12T09:59:25+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 1,170 కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో కరోనా విజృంభణ

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 1,170 కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 565, మేడ్చల్‌ జిల్లాలో 570, వికారాబాద్‌ జిల్లాలో 35 కేసులు నమో దయ్యాయి. మూడు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 65,022కు చేరుకుంది. 


రంగారెడ్డి జిల్లాలో..

ఇబ్రహీంపట్నం / కందుకూరు / శంషాబాద్‌ / ఆమనగల్లు / షాద్‌నగర్‌ / చేవెళ్ల : ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో 62 మందికి పరీక్షలు నిర్వహించగా 14, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 80 మందికిగాను 10,  దండుమైలారంలో 49 మందికిగాను 1, ఎలిమినేడులో 48 మందికిగాను 5,  మంచాలలో 26 మందికిగాను 1, యాచారంలో 51 మందికి 6, మాడ్గులలో 39 మందికిగాను 9, తట్టిఅన్నారంలో 56 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి, రాగన్నగూడలో 42 మందికిగాను 10 మందికి పాజిటివ్‌ అని తేలింది.


కందుకూరు మండలకేంద్రంలో 33మందికి కరోనా పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా గుమ్మడ వెల్లిలో వైద్యబృందం 148 మం దికి కరోనా పరీక్షలు నిర్వహిం చారు. కాగా గ్రామంలో ప్రతి వాడలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. 


శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 63మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా 10మందికి పాజిటివ్‌ వచ్చింది.


ఆమనగల్లు, మైసిగండి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 61 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలు గురికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో ఆమనగల్లులో ముగ్గురు, మైసిగండికి చెందినవారు ఒకరు ఉన్నట్లు గుర్తించారు. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో శుక్రవారం 405 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 59మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 59 మందిలో షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన 12 మంది, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన 31 మంది, కొత్తూర్‌ మండలానికి చెందిన 10 మంది ఉన్నారు. మిగతా ఆరుగురు ఇతర మండలాలకు వారున్నారు.


చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 44 మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 31 మందికి పరీక్షలు చేయగా 4, శంకర్‌పల్లి మండలంలో 86మందికి పరీక్షలు చేయగా 10, మొయి నాబాద్‌ మండలంలో 42మందికి పరీక్షలు చేయగా 2, షాబాద్‌ మండలంలో 53మందికిపరీక్షలు చేయగా 6 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.


వికారాబాద్‌ జిల్లాలో..

ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ / కులకచర్ల : వికారాబాద్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. వికారాబాద్‌లో 10, పరిగిలో 5, కొడంగల్‌లో 5, ధారూరులో 4, యాలాలలో 3, తాండూరులో 2, పూడూరులో 2, దౌల్తాబాద్‌లో 2, కోట్‌పల్లి, మోమిన్‌పేట మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసులు వచ్చాయి.


కులకచర్లలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. కామునిపల్లి, కుస్మసముద్రం, ఘనాపూర్‌ గ్రామాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా వెల్లడైంది


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 82మందికి కరోనా పరీక్షలు చేయగా 12మందికి పాజిటివ్‌ వచ్చింది. శ్రీరంగ వరం పీహెచ్‌సీలో 51మందికిగాను 3కేసులు వచ్చాయి. 


కరోనాతో మహిళ మృతి

యాచారం : యాచారం మండలం మల్కీజ్‌గూడ గ్రామానికి చెందిన మహిళకు కరోనా సోకడంతో నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా, యాచారం మండల కేంద్రంలో కరోనా పరీక్షలకు సిబ్బందిని పెంచాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-09-12T09:59:25+05:30 IST