-
-
Home » Telangana » Rangareddy » carona
-
373 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-20T04:39:48+05:30 IST
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శనివారం 373 కరోనా కేసులు నమోదయ్యాయి.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శనివారం 373 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 158, వికారాబాద్‌జిల్లాలో 2, మేడ్చల్ జిల్లాలో 213 కేసులు నమోద య్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడిజిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 1,11,792కి చేరింది.
షాద్‌నగర్ డివిజన్‌లో..
షాద్‌నగర్‌అర్బన్: షాద్‌నగర్ డివిజన్‌లో శనివారం 198 మందికి కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. షాద్‌నగర్ పీపీ యూనిట్‌లో నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురికి, కొత్తూర్ పీహెచ్‌సీలో నిర్వహించిన పరీక్షల్లో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు నిర్దారించారు.
ఆమనగల్లులో..
ఆమనగల్లు : ఆమనగల్లు ప్రభుత్వ ఆసు పత్రిలో శనివారం కరోనా యాంటిజెన్ టెస్ట్‌లు నిర్వహించారు. ఆమనగల్లు, కడ్తాల మండలాలకు చెందిన 20మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది.
ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో శని వారం 11 కేంద్రాలతోపాటు రెండు మొబైల్ వాహనాల ద్వారా 294 మందికి కరోనా యాంటిజెన్ టెస్టులు నిర్వహించారు. అందులో 17 మందికి పాజిటివ్ వచ్చింది. హయత్‌నగర్‌లో 8, ఇబ్రహీంపట్నం 3, అబ్దుల్లాపూర్‌మెట్ 3, ఎలిమినేడు 1, దండుమైలారం 1, యాచారంలో ఒకరికి పాజిటివ్ అని తేలింది.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్, ఆంధ్రజ్యోతి : వికారాబాద్ జిల్లాలో శనివారం రెండు కరోనా కేసులు మాత్రమే నమోద య్యాయి. అవి కూడా వికారాబాద్ మండల కేంద్రానికి చెందినవిగా వైద్యులు తెలిపారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్ : మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో శనివారం 57 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజి టివ్‌గా నిర్దారణ అయింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 25 మందికి పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాలేదు.