కొనసాగుతున్న కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-12-06T05:22:32+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా ఉధృతి ఆగడం లేదు.

కొనసాగుతున్న కరోనా ఉధృతి

  • ఉమ్మడి జిల్లాలో 311 కరోనా కేసులు నమోదు, ఒకరి మృతి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా ఉధృతి ఆగడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరిగిపోతోంది. శనివారం 311 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 132 కేసులు నమోదు కాగా వికారాబాద్‌ జిల్లాలో 6 కేసులు నమోద య్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 173 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా సోకినవారి సంఖ్య 1,07,542కి చేరుకుంది. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌ : షాద్‌నగర్‌ డివిజన్‌లో 334మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చి నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో కొత్తూర్‌ మండలానికి చెందిన నలుగురు, ఫరూఖ్‌నగర్‌ మండ లానికి చెందిన ఒకరు ఉన్నారు. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..  

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో శనివారం 11 కేంద్రాలతోపాటు రెండు మొబైల్‌ వాహనాల ద్వారా 428 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం 3, యాచారం 1, అబ్దుల్లాపూర్‌మెట్‌ 4, ఎలిమినేడు 2, హయత్‌నగర్‌లో ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది.


 చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 177 మందికి కరోనా పరీక్షలు చేయగా చేవెళ్లలో ఇద్దరికి, షాబాద్‌లో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన మొయినాబాద్‌, శంకర్‌పల్లి మండలాల్లో ఎవ్వరికి పాజిటివ్‌ రాలేదని చెప్పారు.


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో రోజుకు ఐదారు కేసులైనా నమోదవుతున్నాయి. శనివారం కొడంగల్‌లో 3, తాండూరులో 2, వికారాబాద్‌లో ఒక కరోనా కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 2967 కరోనా కేసులు నమోదుకాగా, వాటిలో 172 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 6 మంది ఆసుపత్రుల్లో, 166 మంది హోంకేర్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇంత వరకు జిల్లాలో కరోనా నుంచి 2741 మంది కోలుకోగా, 54 మంది మృతి చెందారు. 


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 21 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 22 మందికి పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదని వైద్యురాలు నళిని తెలిపారు.

Updated Date - 2020-12-06T05:22:32+05:30 IST