ఉమ్మడిజిల్లాలో 257 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-28T05:15:51+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 257 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడిజిల్లాలో 257 కరోనా కేసులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 257 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 121 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. మేడ్చల్‌ జిల్లాలో 125 కేసులు నమోదు కాగా, వికారాబాద్‌ జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 1,05,472కు చేరుకుంది. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో నలుగురికి కరోనా  

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో శుక్రవారం 11 కేంద్రాలతోపాటు రెండు మొబైల్‌ టీంల ద్వారా 358మందికి కరోనా యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం 1, ఎలిమినేడు 1, అబ్దుల్లాపూర్‌మెట్‌ 1, హయత్‌నగర్‌లో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో ఇద్దరికి..

షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించిన కరోనా ర్యాపిడ్‌ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్దారించారు. షాద్‌నగర్‌ డివిజన్‌లోని షాద్‌నగర్‌ పీపీ యూనిట్‌, బూర్గుల, చించోడ్‌, కొందుర్గు, కేశంపేట, కొత్తూర్‌, నందిగామా పీహెచ్‌సీల్లో 250 ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా కొత్తూర్‌ పీహెచ్‌సీలో చేసిన పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్దారించారు. 


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో రోజూ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం తాండూరులో 2, కొడంగల్‌లో 2, కులకచర్లలో 2, బొంరాస్‌పేటలో 2, వికారాబాద్‌, మర్పల్లి, బషీరాబాద్‌ మండలాల్లో ఒక్కొక్క కరోనా కేసులు వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో 2892 కరోనా కేసులు నమోదుకాగా, వాటిలో 224 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 8 మంది వివిధ ఆసుపత్రుల్లో, 216 మంది హోంకేర్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇంతవరకు జిల్లాలో కరోనా నుంచి 2614 మంది రికవరీ కాగా, 54 మంది మృతి చెందారు. 


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ :  మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం 16 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదని వైద్యురాలు మంజుల తెలిపారు. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యురాలు నళిని తెలిపారు. 

Read more