-
-
Home » Telangana » Rangareddy » carona
-
కరోనాతో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-11-22T04:20:11+05:30 IST
కరోనా మహమ్మారి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేగంగా పెరుగుతున్న కరోనా కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : కరోనా మహమ్మారి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేగంగా పెరుగుతున్న కరోనా కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో కరోనాతో మృతి చెందుతున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగు తోంది. శనివారం ఇద్దరు కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో మృతి చెందిన వారి సంఖ్య 184కు చేరుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 336 మంది చనిపోయారు.
418 కేసులు..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శనివారం 418 కేసులు నమోద య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 223, మేడ్చల్ జిల్లాలో 189, వికారాబాద్ జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 1,03,633కి చేరుకుంది.
ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఏడుగురికి కరోనా
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 10 కేంద్రాలతోపాటు ఓ మొబైల్ టీం ద్వారా 334 మందికి కరోనా యాంటిజెన్ టెస్టులు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. ఇబ్రహీంపట్నం 1, యాచారం 2, అబ్దుల్లాపూర్‌మెట్ 1, మంచాల 1, హయత్‌నగర్‌లో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది.
ఆమనగల్లులో రెండు కరోనా కేసులు
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కరోనా యాంటిజెన్ టెస్ట్‌లు నిర్వహించారు. ఆమనగల్లు, కడ్తాల మండలాల పరిధి లోని 23 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురికి...
షాద్‌నగర్: షాద్‌నగర్ డివిజన్‌లో శనివారం 341 మందికి కరోనా యాంటిజెన్ పరీ క్షలు నిర్వహించగా నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. నలుగురిలో కొత్తూర్ మండ లానికి చెందిన ఇద్దరు, షాద్‌నగర్ పట్టణా నికి చెందిన ఒకరు, నందిగామ మండ లానికి చెందిన ఒకరు ఉన్నారు.
చేవెళ్ల డివిజన్‌లో..
చేవెళ్ల : చేవెళ్ల డివిజన్ పరిధిలో 227 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. శనివారం శంకర్‌పల్లిలో ఒకరికి, షాబాద్ మండలాల్లో ఒకరికి పాజిటివ్ వచ్చింది. అలాగే చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో ఎవరికీ పాజిటివ్ రాలేదని వైద్యులు తెలిపారు.
మేడ్చల్‌లో 9మందికి పాజిటివ్
మేడ్చల్ : మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో శనివారం 69 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 44మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యురాలు నళిని తెలిపారు.