గంజాయి తరలిస్తున్న ఇద్దరి రిమాండ్‌

ABN , First Publish Date - 2020-02-16T09:14:21+05:30 IST

గంజాయి తరలిస్తున్న ఇద్దరి రిమాండ్‌

గంజాయి తరలిస్తున్న ఇద్దరి రిమాండ్‌

  •  బైక్‌, 12కిలోల గంజాయి స్వాధీనం


ఘట్‌కేసర్‌ రూరల్‌ :  గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకోని రిమాండ్‌కు తరలించారు. ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌ మల్లయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిస్సా రాష్ట్రం, మల్కాన్‌గిరి మండలం, బుబన్‌పల్లి గ్రామానికి చెందిన మహనంద్‌ బాల (30) బరున్‌ బండల్‌ (35) అన్నోజిగూడలో నివాసం ఉంటూ సెంట్రింగ్‌ పనులు చేస్తూ ఒడిస్సా  నుంచి గంజాయిని తరలిస్తున్నారు. శనివారం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ప్రదీ్‌పరావు ఆదేశాల మేరకు ఘణపూర్‌కు వెళ్లే దారిలోని అవుటర్‌రింగ్‌ రోడ్డు బ్రిడ్జి వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చి బైక్‌ను తనిఖీ చేయగా మహానంద్‌ బాల, బరున్‌ బండల్‌లను అదుపులోకి తీసుకొని సోదా చేయగా 12 కిలోల 450 గ్రాము   గంజాయి లభించింది. ఇద్దరిని విచారించగా ఒడిస్సా  నుంచి గంజాయిని రెండు వేల రూపాయలకు కోనుగోలు చేసి ఘట్‌కేసర్‌ పరిసరాల ప్రాంతాలలో 10 వేలకు   విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి బైక్‌, 12 కిలోల 450 గ్రాముల గంజాయి, ఒక  ఫోనును స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌ మల్లయ్య తెలిపారు. 

Updated Date - 2020-02-16T09:14:21+05:30 IST