భవన నిర్మాణ అనుమతులు సరళతరం
ABN , First Publish Date - 2020-03-27T12:01:10+05:30 IST
మున్సిపల్ నూతన చట్టం ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలో భవన నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు పొందవచ్చునని మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో
మేడ్చల్ : మున్సిపల్ నూతన చట్టం ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలో భవన నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు పొందవచ్చునని మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకృత విధానము(టీఎస్ బీపాస్) ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తుదారులే స్వయంగా వివరాలు నమోదు చేసుకొని భవన నిర్మాణ అనుమతి పొందవచ్చునన్నారు. గ్రౌండ్ ప్లస్ టూ అంతస్తులు, 500 చదరపు మీటర్ల వరకు ఉన్న పాట్లలో గృహ నిర్మాణానికి, స్వయంచాలిత ఫీజు చెల్లించడం ద్వారా స్వీయ ధ్రువపత్రం ఆధారంగా తక్షణ అనుమతి పొందవచ్చునన్నారు. గ్రౌండ్ ప్లస్ టూ అంతస్తుల కన్నా ఎక్కువ ఉండే నివాస భవనాలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు.