బొడ్రాయి ప్రతిష్ఠ ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-11-26T05:26:06+05:30 IST

బొడ్రాయి ప్రతిష్ఠ ఉత్సవాలు

బొడ్రాయి ప్రతిష్ఠ ఉత్సవాలు
బొడ్రాయికి పూజలు నిర్వహిస్తున్న గ్రామస్థులు

చౌదరిగూడ: మండల పరిధిలోని జిల్లేడ్‌ గ్రామంలో బుధవారం పూజారి నందీశ్వర స్వామి ఆధ్వర్యంలో బొడ్రాయి, మైసమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, ప్రత్యేక పూజలు, భారీగా తరలివచ్చిన భక్తులతో గ్రామంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే తనయుడు, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు వై.మురళీయాదవ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవత అయిన మైసమ్మ, బొడ్రాయి దేవత ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున రావడంతో గ్రామం మొత్తం శోభాయమానంగా మారిందన్నారు. ఆధ్యాత్మికతకు మారుపేరు చౌదరిగూడ మండలం అని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌  బాబురావు, ఉప సర్పంచ్‌  లక్ష్మి, జడ్పీటీసీ స్వరూప, తహసీల్దార్‌ రాములు, గ్రామ పెద్దలు దిలీ్‌పరెడ్డి, అమిత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బి.ప్రహ్లాద్‌, పి.వెంకటేష్‌, బాలచంద్రయ్య, వ్యాపారవేత్త ఎ.నాగరాజు, మాజీ జడ్పీటీసీ సుధాకర్‌రావు, ఎల్లేష్‌, శశిధర్‌, గిరిధర్‌, విజయ్‌, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:26:06+05:30 IST