-
-
Home » Telangana » Rangareddy » Blast
-
ఐరన్ పరిశ్రమలో పేలిన ఫర్నెస్
ABN , First Publish Date - 2020-12-06T05:35:35+05:30 IST
ఐరన్ పరిశ్రమలో పేలిన ఫర్నెస్

- ఇద్దరికి స్వల్ప గాయాలు
- కార్మికులకు తప్పిన ముప్పు
కొత్తూర్: కొత్తూర్ పారిశ్రామికవాడ పరిధిలోని ఓ ఐరన్ పరిశ్రమలో శనివారం ఉదయం ఫర్నె్‌స(బట్టీ) పేలిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయలయ్యాయని తోటి కార్మికులు తెలిపారు. ఫర్నెస్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి పేలిపోయిందని తెలిపారు. ఫర్నెస్ పేలినప్పుడు దాని సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద మప్పు తప్పిందని పేర్కొన్నారు. ఫర్నెస్ చివర ఉన్న ఇద్దరు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. ఫర్నెస్ వద్ద కార్మికులు ఉన్నట్లయితే భారీ ప్రాణనష్టం జరిగేదని చెప్పారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఫర్నెస్ పేలిందని కార్మికులు ఆరోపించారు. కాగా ఫర్నెస్ పేలిన సంఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.