అమలుకాని కేసీఆర్‌ ఎన్నికల హామీలు

ABN , First Publish Date - 2020-12-31T04:55:13+05:30 IST

అమలుకాని కేసీఆర్‌ ఎన్నికల హామీలు

అమలుకాని కేసీఆర్‌ ఎన్నికల హామీలు
చింతగూడలో బీజేపీలో చేరుతున్న యువకులు

బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్‌రెడ్డి

షాద్‌నగర్‌అర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాలేదని బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఫరూఖ్‌నగర్‌ మండలం చింతగూడ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు శ్రీవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్‌నగర్‌ ప్రాంతానికి సాగునీటిని అందించడానికి చౌదరిగూడ మం డలం లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తామంటూ ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేస్తూ లబ్ధిపొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని సర్వేకే పరిమితం చేశారని అన్నారు. నియంత్రిత వ్యవసా యం అంటూ రైతులకు తీవ్ర నష్టాన్ని కల్గించిన కేసీఆర్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ అం టూ ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నిక ల్లో బీజేపీ ఘన విజయం సాధించి, తెలంగాణాలో అధికారాన్ని చేపడుతుందని శ్రీవర్ధన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజే పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి ఆశోక్‌గౌడ్‌, నాయకులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, పి.వెంకటేశ్వర్‌రెడ్డి, ఇస్నాతి శ్రీనివాస్‌, దోడల వెంకటేష్‌, ఆకుల ప్రదీప్‌, శ్యామ్‌సుందర్‌రెడ్డి, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T04:55:13+05:30 IST