పనిచేసే ప్రతి ఒక్కరికీ బీజేపీలో గుర్తింపు

ABN , First Publish Date - 2020-12-11T05:08:11+05:30 IST

పనిచేసే ప్రతి ఒక్కరికీ బీజేపీలో గుర్తింపు

పనిచేసే ప్రతి ఒక్కరికీ బీజేపీలో గుర్తింపు
రఘునందన్‌కు నియామకపత్రాన్ని అందజేస్తున్న అశోక్‌గౌడ్‌

కందుకూరు: ప్రజా సమస్యలను పరిష్కారానికి, పార్టీ అభ్యున్నతికి పాటుపడే ప్రతి ఒక్కరికీ బీజేపీలో గుర్తింపు ఉంటుందని పార్టీ మండల అధ్యక్షుడు అనేగౌని అశోక్‌గౌడ్‌ అన్నారు. గురువారం మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన చిలుకల రఘునందన్‌ను మండల పార్టీ కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలకు అంకితమై, నిజాయితీ, నిబద్ధతతో పార్టీ నాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. రఘునందన్‌ కొన్నేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారని తెలిపారు. తనకు పార్టీ మండల కార్యదర్శి నియమించడం పట్ల రఘునందన్‌ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గూడూరు ఎంపీటీసీ ఎస్‌.ఎల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు పండల శ్రీనివా్‌సగౌడ్‌, మల్లే్‌షయాదవ్‌, పి.సురేందర్‌, రాధకుమార్‌, కె.మదన్‌, ఎ.మోహన్‌యాదవ్‌, సీహెచ్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:08:11+05:30 IST