వచ్చే సాధారణ ఎన్నికల్లో సత్తాచాటుతాం

ABN , First Publish Date - 2020-12-06T05:02:26+05:30 IST

వచ్చే సాధారణ ఎన్నికల్లో సత్తాచాటుతాం

వచ్చే సాధారణ ఎన్నికల్లో సత్తాచాటుతాం
వికారాబాద్‌లో విజయోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సదానందరెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతానందరెడ్డి 

వికారాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు టి.సదానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని శనివారం ఆ పార్టీ నాయకులు బసవేశ్వర చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లాలో బీజేపీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు కోకట్‌ మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.శివరాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్‌,  వివేకానందరెడ్డి, రాజేందర్‌రెడ్డి, పోకల సతీష్‌, రఘుపతి, రవితేజగుప్తా, గోపాల్‌రెడ్డి,  ప్రభు విజయరాజ్‌, సాయిచరణ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:02:26+05:30 IST