భగీరథ పనులను పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2020-08-12T10:00:02+05:30 IST
అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను

(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్) : అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మిషన్ భగీరథ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
రంగారెడ్డి జిల్లాలో రూ.436కోట్ల 35లక్షల వ్యయంతో 1,062 ఆవాసాలకు 2876కిలోమీటర్ల మేర ప్రత్యేక పైప్‌లైన్ వేసి ఇంటింటికీ తాగు నీరందించే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 656 గ్రామాలకు 90శాతానికిపైగా కుటుంబాలకు నీరందుతుందని, వీటిని గ్రీన్‌గ్రామాలుగా, 90 శాతం కన్న తక్కువ గృహాలకు నీరందుతున్న 386 గ్రామాలను ఆరెంజ్ గ్రామాలుగా, అసలు నీరందని 24 గ్రామాలను రెడ్ గ్రామాలుగా విభిజించడమైందన్నారు. కొన్నిచోట్ల అసంపూర్తి పనుల వల్ల మొత్తం గ్రామానికే నీరందటం లేదని, ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని 287ఆవాస గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు నీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని రెడ్ గ్రామాలన్నిటినీ గ్రీన్‌జోన్లకు తీసుకురావాలని ఆదేశించారు.
అన్ని పాఠశాలలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలకు వెంటనే వాటర్ కనెక్షన్‌లు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా రైతు వేదికలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలని తెలిపారు. భగీరథ పనుల వల్ల దెబ్బతిన్న సీసీరోడ్లను త్వరగా వేయాలని ఆదేశించారు. అదనపు పైపులైన్లు, ఓహెచ్‌ఆర్‌లు అవసరముంటే వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో 1,091 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీరందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలో 722 గ్రీన్, 297 ఆరెంజ్, 12 రెడ్ గ్రామాలున్నాయని మంత్రి తెలిపారు. జిల్లాలో మొత్తం 925 ఓహెచ్‌ఎ్‌సఆర్‌ల నిర్మాణాలు చేపట్టగా 897 పూర్తయ్యాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, నరేందర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, మహే్‌షరెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, వికారాబాద్ కలెక్టర్ పౌసమిబసు, రంగారెడ్డి జిల్లా అదనపుకలెక్టర్ హరీష్, ఇంజనీర్లు పాల్గొన్నారు.