చెక్‌డ్యామ్‌ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-09T09:31:20+05:30 IST

మండల పరిధిలోని కాచారంలో చెక్‌ డ్యామ్‌ పూడికతీత పనులను శుక్రవారం జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి , జడ్పీటీసీ నీరటి తన్వీరాజు,

చెక్‌డ్యామ్‌ పనులు ప్రారంభం

శంషాబాద్‌రూరల్‌: మండల పరిధిలోని కాచారంలో చెక్‌ డ్యామ్‌ పూడికతీత పనులను శుక్రవారం జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి , జడ్పీటీసీ నీరటి తన్వీరాజు, ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివా్‌సతో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను అదుకునేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పిస్తున్నట్లు తెలిపారు.   అనంతరం మొక్కలకు నీరు పోశారు. ఈ కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్‌ రాంగోపాల్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఈపీవోఆర్‌డీ  శేషగిరిశర్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-09T09:31:20+05:30 IST