సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి

ABN , First Publish Date - 2020-05-18T11:00:14+05:30 IST

వర్షాకాలం రానున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు.

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి

 ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌


వికారాబాద్‌: వర్షాకాలం రానున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. ఆదివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన నివాసంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా శివరాంనగర్‌ కౌన్సిలర్‌ గాయత్రి లక్ష్మణ్‌, బీటీఎస్‌ కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి, ఇంద్రానగర్‌ కౌన్సిలర్‌ సువర్ణ అశోక్‌, ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు వారి ఇళ్లు, పరిసరాల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ మం జుల, మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ రమే్‌షకుమార్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


బార్వాద్‌ నర్సరీ తనిఖీ..

బంట్వారం (కోట్‌పల్లి) : ఆరవ విడత హరితహారానికి అందరూ సిద్దంగా ఉండాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. ఆదివారం కోట్‌పల్లి మండల పరిధిలోని బార్వాద్‌ గ్రామంలో గల నర్సరీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో మొక్కల నిర్వహణ, రికార్డుల నమోదు చేయకపోవడంపై ఉపాధిహామీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కోట్‌పల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అనీల్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటే్‌షయాదవ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-18T11:00:14+05:30 IST