బతుకమ్మ చీరలు వచ్చేశాయ్‌!

ABN , First Publish Date - 2020-09-16T05:52:49+05:30 IST

తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బతుకమ్మ పండగ రానే వస్తోంది. బతుకమ్మ పండగను పురస్క రించుకొని ప్రతిఏటా మహిళలకు తెలంగాణ సర్కార్‌ చీరలు పంపిణీ చేస్తుండగా..

బతుకమ్మ చీరలు వచ్చేశాయ్‌!

ఉమ్మడి జిల్లాకు చేరిన  4,20,840 చీరలు

గోదాముల్లో నిల్వ చేసిన అధికారులు

త్వరలో రానున్న మరికొన్ని చీరలు 

18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు అందజేత

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు చర్యలు

ఇంకా ఖరారు కాని విధివిధానాలు 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బతుకమ్మ పండగ రానే వస్తోంది. బతుకమ్మ పండగను పురస్క రించుకొని ప్రతిఏటా మహిళలకు తెలంగాణ సర్కార్‌ చీరలు పంపిణీ చేస్తుండగా.. ఈ ఏడాది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16,52,143 మంది మహిళలకు ఉచితంగా చీరలను అందజే యాలని నిర్ణయించారు. ఈసారి నిర్ణీత గడువు లోగా లబ్ధిదారులకు అందించాలని సర్కార్‌ సన్నాహాలు చేస్తుంది. రెండేళ్లుగా రేషన్‌ షాపులు, గ్రామపంచాయతీల ద్వారా చీరలను అంద జేశారు. ఆహారభద్రత కార్డులు లేదా ఆధార్‌ కార్డులు తీసుకెళ్తే సంతకాలు తీసుకుని చీరలు ఇచ్చేవారు. ఈసారి కరోనా దృష్ట్యా నేరుగా ఇళ్ల వద్దకే వెళ్ల మహిళలకు చీరలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగర, పురపాలక, గ్రామ పంచాయతీల పరిధిలోని సిబ్బంది, మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో ఉంది.


ఉమ్మడి జిల్లాలో 16.52 లక్షల లబ్ధిదారులు

ఈసారి చీరలను పంపిణీ చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని పౌరసరఫరాల శాఖ ద్వారా 18 ఏళ్లు గల వారందరి వివరాలు సేకరించారు. రేషన్‌ దుకాణాల్లో 18 ఏళ్లు నిండిన వారందరికీ చీరలు పంపిణీ చేయడంతోపాటు కొత్తగా రేషన్‌ కార్డులు తీసు కున్నవారు, గత కార్డుల్లో 18 ఏళ్లు నిం డిన వారు కొత్తగా రావ డంతో చీరల పంపిణీ సంఖ్య ఈసారి మ రింతగా పెరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,203 రేషన్‌ షాపులు ఉండగా ఈ సారి 16,52,143 మంది మహిళలలను అర్హులుగా గుర్తించారు. 


మూడు జిల్లాలకు చేరిన చీరలు

ఉమ్మడి జిల్లాలోని గోదాంలకు 4,20,840 చీరలు చేరాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయి నాబాద్‌ మండలంలోని గోదాంకు 1,40, 840 చేరాయి. అలాగే మేడ్చల్‌ జిల్లాలో 1,85,000 చీరలు చేరాయి. శామీర్‌పేట గోదాంకు 98,000, కుత్బుల్లాపూర్‌లోని గోదాంకు 50,000, కాప్రాలోని గోదాంకు 37,000 చీరలు చేరాయి. అలాగే వికారాబాద్‌ జిల్లాకు సంబంధించి 95వేల చీరలు గోదాంలో నిల్వఉంచారు. స్టాక్‌ పాయింట్‌ నుంచి ఆయా మండలాలకు అధికారులు చీరలను చేరవేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇంకా 12,31,303 చీరలు ఉమ్మడిజిల్లాకు రావాల్సి ఉంది. 


ఖరారు కాని విధి విధానాలు

గతంలో పౌర సరఫరా శాఖ రేషన్‌ దుకాణాల ద్వారా మహిళా స్వయం సహా యక సంఘాలు, మున్సిపల్‌ ప్రాం తాల్లో మున్సిపల్‌ అధికారుల ఆధ్వ ర్యంలో బతుకమ్మ చీర లను పంపిణీ చేశారు. ఇందు కోసం కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి... రేషన్‌ కార్డులను తీసుకొచ్చిన మహిళలకు చీరలను అందించేవారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో చీరలను ఎలా పంపిణీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలా..? లేక గతేడాది మాదిరిగా పంపిణీ చేయాలా.. అనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. 


బతుకమ్మ చీరల వివరాలు

రంగారెడ్డి వికారాబాద్‌ మేడ్చల్‌ మొత్తం

జిల్లాలో మొత్తం రేషన్‌ షాపులు  919 588 696 2,203

అర్హులైన మహిళల సంఖ్య 6,76,332 3,16,583 6,59,228 16,52,143

జిల్లాకు చేరిన చీరల సంఖ్య 1,40,840 95,000 1,85,000 4,20,840


రంగారెడ్డి జిల్లా..

సం. అర్హుదారుల పంపిణీ

గుర్తింపు చేసిన చీరలు

2018 6,49,366 4,77,926

2019 6,65,686 4,60,000


వికారాబాద్‌ జిల్లా

సం. అర్హుదారుల పంపిణీ

గుర్తింపు చేసిన చీరలు

2018 2,78,840 2,78,840

2019 2,87,621 2,87,621


మేడ్చల్‌ జిల్లా 

సం. అర్హుదారుల పంపిణీ

గుర్తింపు చేసిన చీరలు

2018 - - - - 

2019 6,47,898 4,47,000

Updated Date - 2020-09-16T05:52:49+05:30 IST