జంగయ్య అవార్డు

ABN , First Publish Date - 2020-11-28T05:20:00+05:30 IST

జంగయ్య అవార్డు

జంగయ్య అవార్డు
అవార్డును అందుకుంటున్న జంగయ్య మాదిగ

షాద్‌నగర్‌ అర్బన్‌: ఎస్సీ వర్గీకరణ మలిదశ ఉద్యమకారుడు సోలీపూర్‌ గ్రామ వాసి సింగపాగ జంగయ్యమాదిగను బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డుతో టీఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర శాఖ సన్మానించింది. సికింద్రాబాద్‌లోని చిల్లీస్‌ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో టీఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు, రాష్ట్రశాఖ అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్‌ మాదిగ అవార్డును ఇచ్చి అభినందించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మరింతగా శ్రమిస్తూ ఎమ్మార్పీఎస్‌ ఉద్యమాన్ని బలోపేతం చేస్తానని, మరింత బాధ్యతగా పనిచేస్తానని, అవార్డును ఇచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు జంగయ్య మాదిగ అన్నారు.


Read more