జిల్లాలో ఢిల్లీ భయం!

ABN , First Publish Date - 2020-04-01T11:33:31+05:30 IST

కరోనా మహమ్మారిపై ప్రభుత్వం, ప్రజలు పోరా డుతున్న సమయంలో తాజా గా వెలుగులోకి వచ్చిన విషయం

జిల్లాలో ఢిల్లీ భయం!

మర్కాజ్‌కు వెళ్లివచ్చిన వారికి కరోనా

ఉమ్మడి జిల్లా నుంచి 100 మందికిపైగానే హాజరు 

ప్రభుత్వ హెచ్చరికలతో ఇంటింటికీ ఆరా

ఇప్పటికే కొందరిని క్వారంటైన్‌కు తరలింపు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): కరోనా మహమ్మారిపై ప్రభుత్వం, ప్రజలు పోరా డుతున్న సమయంలో తాజా గా వెలుగులోకి వచ్చిన విషయం ఉమ్మడి జిల్లా వాసుల్లో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీలోని  మర్కాజ్‌లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమానికి హాజరైన అనేక మందికి కరోనా సోకడం, ఇందులో తెలంగాణకు చెందిన ఆరుగురు మృతి చెందిన విషయం సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 100 మందికి పైగా హాజరయ్యారు,. ఇందులో గ్రామీణ  ప్రాంతాల్లో 50 మంది వరకు ఉన్నారు. సోమవారం అర్థరాత్రి ఇందులో కొందరి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వానికి ఉన్న సమాచారం మేరకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి కొందరిని క్వారంటైన్‌కు తరలించారు.


మరికొందరిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే మంగళవారం గుర్తించిన మరికొందరిని మాత్రం రాజేంద్రనగర్‌కు తరలించారు. వీరి నుంచి బ్లడ్‌ శాం పిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపారు. బుధ వారంలోగా ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉం ది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో సగం మంది హైదరాబాద్‌ చుట్టు పక్కల జీహెచ్‌ ఎంసీ పరిధిలో నివసించే వారు ఉన్నారు. ఢిల్లీ నుంచి వీరంతా విమానాలు, రైళ్లలో హైదరాబాద్‌కు వచ్చా రు. ఇలా వచ్చిన వారిలో కొందరు కొన్ని ఫంక్షన్లకు కూడా హాజరయ్యారు. దీంతో చుట్టు పక్కల వారు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం కూడా వీరి విషయాన్ని సీరియ్‌సగానే తీసుకుని విచారిస్తోంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటికే ఆరుగురు కరోనాతో చనిపోవడం కలకలం రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా కరోనా విస్తరించినప్పటికీ ఇక్కడ మాత్రం దేశీయ ప్రయాణికుల ద్వారానే కరోనా విస్తరించడం అందరిలో కలవరపెడుతోంది. ఢిల్లీ నుంచి వీరు ప్రయాణించిన విమానాలు, రైళ్ల వివరాలను సేకరిస్తున్నారు.


ఆ సమయాల్లో వీరితో పాటు ఎవరెవరు ప్రయాణించారు? మార్గ మధ్యలో  ఎవరిని కలి శారు? ఫంక్షన్లకు ఏమైనా హాజరయ్యారా? ఎక్కడెక్కడ తిరిగారు?  ఇప్పుడు వారి ఆరోగ్యం ఎలా ఉంది? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే  ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి సంఖ్య ప్రభుత్వం ప్రాథ మికంగా ప్రక టించిన లెక్కల కంటే అధికంగా ఉంది. వికారా బాద్‌ జిల్లా నుంచి 13 మంది ఢిల్లీ వెళ్లినట్లు ప్రాథమిక అంచనా వేసినప్పటికీ మంగళవారం వీరి సంఖ్య 29గా తేల్చారు. అలాగే జీహెచ్‌ఎంసీ మినహాయించి రంగారెడ్డి జిల్లాలో మర్కాజ్‌ నుంచి వచ్చిన వారు 13 మంది ఉన్నట్లు తేల్చగా ఈ సంఖ్య 14కి పెరిగింది.


అలాగే మేడ్చల్‌ జిల్లాలో ముగ్గురు అని ప్రకటించినప్పటికీ తరువాత నలుగురు అని తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.  వికారాబాద్‌ జిల్లాలో తాండూరు, వికారాబాద్‌,  ధారూర్‌, పరిగి,  మోమిన్‌పేట, మర్పల్లి, దోమ మండలాల నుంచి ఢిల్లీకి వెళ్లారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌, మెయినాబాద్‌, నందిగామ, మహేశ్వరం, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాలకు చెందిన వారు ఉన్నారు. ఇక మేడ్చల్‌ జిల్లాలో కీసర, మేడ్చల్‌ మండలాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా ఢిల్లీ వెళ్లి ఈ నెల 17న తిరిగి జిల్లాలకు చేరుకున్నారు. ఇలా ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు బయటపడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.  


Updated Date - 2020-04-01T11:33:31+05:30 IST