అపార్ట్‌మెంట్‌ సభ్యుల ఔదార్యం

ABN , First Publish Date - 2020-12-21T04:25:11+05:30 IST

అపార్ట్‌మెంట్‌ సభ్యుల ఔదార్యం

అపార్ట్‌మెంట్‌ సభ్యుల ఔదార్యం
పండరి భార్యకు చెక్కును అందజేస్తున్న అపార్ట్‌మెంట్‌ ఓనర్లు, టెనెట్స్‌

శామీర్‌పేట: తూంకుంట మున్సిపాలిటీలో ఉన్న శ్రీసాయి న్యూ అనురాగ్‌ టౌన్‌షి్‌ప అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పండరి భార్యకు రెండు రోజుల క్రితం గుండెపోటుతో సికింద్రాబాద్‌లోని యశోధ ఆసుపత్రిలో ఆదివారం చేర్చారు. దీంతో వాచ్‌మెన్‌ పండరి ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటం గమనించిన ఆ అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌ ఓనర్స్‌, టెనెంట్స్‌ బాల్‌రెడ్డి, బిల్డర్‌ మోహన్‌రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్‌ పూజ భరత్‌ సింగ్‌, వెంటనే స్పందిచారు. అందరి సహకారంతో ఆసుపత్రి ఖర్చు రూ.లక్షా 37వేల చెక్కును వాచ్‌మెన్‌ భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ భరత్‌సింగ్‌, అపార్ట్‌మెంట్‌ అధ్యక్షుడు ఎస్సీ శ్రీనివాస్‌, కత్తి వెంకటేష్‌, జనరల్‌ సెక్రటరీలు అరవింద్‌ గుప్తా, కళ్యాణ్‌, ఉపాధ్యక్షులు గోపు శ్రీనివాస్‌, మధు, కోశాధికారి ఉమాపతి, మహేష్‌, సుధీర్‌, బాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, శివ, విజేంద్రరెడ్డి, టీవిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-21T04:25:11+05:30 IST