ఆలయాల పరిరక్షణకు పాటుపడాలి

ABN , First Publish Date - 2020-12-21T04:22:50+05:30 IST

ఆలయాల పరిరక్షణకు పాటుపడాలి

ఆలయాల పరిరక్షణకు పాటుపడాలి
మాతా అన్నపూర్ణేశ్వరీ కాశీవిశ్వనాథస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్న రంగరాజన్‌

  • చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌

మొయినాబాద్‌ రూరల్‌: హిందూ మత వైశిష్ట్యాన్ని చాటిచెప్పి ఆలయాల పరిరక్షణకు అందరూ పనిచేయాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌. రంగరాజన్‌ అన్నారు. ఆదివారం చిలుకూరులోని మాతా అన్నపూర్ణేశ్వరీ కాశీవిశ్వనాతిథస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. వేడుకల్లో రంగరాజన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో ఆధాత్మికత పెరగాలన్నారు. దేవాలయాల్లోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. హిందూ యువత చెడుమార్గాన వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో బాలాజీ ఆలయ మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ గోపాలక్రిష్ణ పంతులు, వీరశైవ లింగాయత్‌ సమాజం మండల అధ్యక్షుడు, చిలుకూరు మాజీ సర్పంచ్‌ పురాణం వీరభద్రస్వామి, ఉపాధ్యక్షుడు బస్వరాజు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కొత్త నర్సింహారెడ్డి, కార్యదర్శి భిక్షపతి, వీరేశం, నాగేంద్రబస్వరాజ్‌, నాగేంద్రస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-21T04:22:50+05:30 IST