-
-
Home » Telangana » Rangareddy » animal death
-
విద్యుత్‌షాక్‌తో గేదె మృత్యువాత
ABN , First Publish Date - 2020-11-21T05:32:08+05:30 IST
విద్యుత్‌షాక్‌తో గేదె మృత్యువాత

కీసర: విద్యుత్‌షాక్‌తో గేదె మృత్యువాతపడిన సంఘటన కీసరలో శుక్రవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన రైతు రామిడి సుధాకర్‌రెడ్డి తన గేదెను పొలంలో మేత మేసేందుకు శుక్రవారం తీసుకెళ్లాడు. ఇనుప స్థంభం వద్దకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు ఎర్తింగ్ తగిలి విద్యుత్‌షాక్‌తో గేదె అక్కడికక్కడే మృతిచెందింది. ఇది గమనించిన సుధాకర్‌రెడ్డి వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గేదెమృతితో రైతు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనకు పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరాడు.