-
-
Home » Telangana » Rangareddy » Ambedker statue inaguration
-
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగుల ఆశాజ్యోతి
ABN , First Publish Date - 2020-12-28T05:19:22+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగుల ఆశాజ్యోతి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
బొంరాస్‌పేట్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. ఆదివారం బొంరా్‌సపేట్ మండలం నాందర్‌పూర్ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ భారతరాజ్యాంగంలో బడుగులకు రిజర్వేషన్లు కల్పించిన మహానీయుడు అని అన్నారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన సమాజానికి చేసిన సేవలను కృష్ణయ్యతో పాటు వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు విజయేందర్, శ్రీను, నర్సిములు, అశోక్, మాసాని వెంకటయ్య పాల్గొన్నారు.