ఆమనగల్లును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2020-12-02T04:51:39+05:30 IST
ఆమనగల్లును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ పాలకవర్గం కృషి చేయాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి కోరారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో 5వ, 13వ వార్డుల్లో రూ.15 లక్షలతో చేపట్టిన అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులను మంగళవారం మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, కౌన్సిలర్ జ్యోతి నర్సింహతో కలిసి ఆచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆచారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల, పట్టణాలు, గిరిజన తాండాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు చోటులేకుండా ప్రజలంతా పాలు పంచుకోవాలని ఆయన కోరారు. ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి జిల్లాలోనే ఆదర్శంగా నిలపాలన్నారు. మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆచారి కోరారు. తాగునీరు, పారిశుధ్య కార్యక్రమాల విషయంలో ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలన్నారు. పట్టణ పరిధిలో మొదటి విడుత రూ.90 లక్షలతో పలు వార్డుల్లో అంతర్గత మురుగు కాల్వలు, సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు విజయ్ కృష్ణ, విక్రంరెడ్డి, చెన్నకేశవులు, కృష్ణయాదవ్, చెక్కల లక్ష్మణ్, ఝాన్సీ శేఖర్, దివ్య శ్రీకాంత్ సింగ్, మేడిశెట్టి శ్రీధర్, పాషా, గజ్జె యాదమ్మ, జానయ్య, మల్లయ్య, నర్సింహ్మ, కుమార్, యాదగిరి, మల్లేష్, వెంకటేష్, శంకరయ్య, ప్రవీన్, గణేష్, భరత్, శ్రీకాంత్, ఆంజనేయులు, కండె సాయి, రాము, రమేష్, రాజు, జెనిగెల గిరి తదితరులు పాల్గొన్నారు.