పోచారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2020-12-04T05:19:44+05:30 IST

పోచారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

పోచారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
పోచారం మున్సిపాలిటీలోని నారపల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

పోచారం మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.సురేష్‌ 

ఘట్‌కేసర్‌: అక్రమ నిర్మాణాలు చేపడితే కఠినచర్యలు తప్పవని పోచారం మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.సురేష్‌ హెచ్చరించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి, పోచారంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను జేసీబీ, సిబ్బందితో కూల్చివేయించారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ పలుచోట్ల రోడ్లు, పార్కు స్థలాలను అక్రమిస్తూ నిర్మాణాలు చేస్తున్నారని అలాంటి వాటిని కూల్చి వేయడంతో పాటు సదరు వ్యక్తులపై కేసులు పెడతామని హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడంతో పాటు కూల్చివేతలకు అయ్యో ఖర్చులను సైతం నిర్మాణదారుల నుంచే వసూలు చేస్తామన్నారు. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణ దారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామని హెచ్చరించారు. నిర్మాణ దారులు టీఎస్‌ బీ పాస్‌ నుంచి అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

Updated Date - 2020-12-04T05:19:44+05:30 IST