ఎమ్మెల్యే అక్బరుద్ద్దీన్‌ వ్యాఖ్యలపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2020-11-27T04:35:05+05:30 IST

ఎమ్మెల్యే అక్బరుద్ద్దీన్‌ వ్యాఖ్యలపై టీడీపీ నిరసన

ఎమ్మెల్యే అక్బరుద్ద్దీన్‌ వ్యాఖ్యలపై టీడీపీ నిరసన
నిరసన తెలుపుతున్న నాయకులు

ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు: మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సమాధులను కూల్చివేయాలని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం ఇబ్రహీంపట్నంలో టీడీపీ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌ రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భగా అక్బరుద్దీన్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దేశానికి సేవ చేసిన మహానాయకులపై అక్భరుద్దీన్‌ వ్యాఖ్యలు తన అహంకారానికి నిదర్శనమన్నారు. అనుచిత వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రచార కార్యదర్శి మంకు ఇందిర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్‌, పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు జక్క రాంరెడ్డి, చక్రపాణి, కరుణాకర్‌రెడ్డి, మహేందర్‌, అశోక్‌, వీరాచారి తదితరులున్నారు. అనుచిత వ్యాఖ్యాలు చేసిన అక్భరుద్దీన్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ ఆదిభట్ల మున్సిపాలిటీ సీనియర్‌ నాయకుడు మెట్టు దామోదర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి సురేందర్‌గౌడ్‌, టీఎ్‌సఎ్‌సఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఎంగిలి శ్రీధర్‌, కుమార్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆమనగల్లులో వారు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు, ప్రధానిగా పీవీ నర్సింహారావు ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తులపై అక్బరుద్దీన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. సమావేశంలో నాయకులు వెంకటే్‌షగౌడ్‌, సురేష్‌, కాల్లె శివ, నరే్‌షయాదవ్‌, శివచారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T04:35:05+05:30 IST