-
-
Home » Telangana » Rangareddy » Airport closed
-
విమానాశ్రయం మూత
ABN , First Publish Date - 2020-03-25T11:49:51+05:30 IST
కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రప్రభుత్వం అదేశాల మేరకు పౌర విమానయాన శాఖ దేశంలోని జాతీయ...

శంషాబాద్‌రూరల్ : కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రప్రభుత్వం అదేశాల మేరకు పౌర విమానయాన శాఖ దేశంలోని జాతీయ విమాన సర్వీసులన్నీ మంగళవారం అర్థరాత్రి రద్దు చేసినట్లు తెలిపింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు మూత పడింది. విద్యుత్ దీపాలలో మెరిసే ఎయిర్‌పోర్టు విమాన సర్వీసులు రద్దులు కావడంతో చీకట్లు కుమ్మకున్నాయి. కారు పార్కింగ్ ఏరియా, డిపాచ్చర్, అరైవల్ ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. 2008న ప్రారంభమైన ఎయిర్‌పోర్టు ఇప్పటి వరకూ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కొనలేదు.