కందిపంటను పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి

ABN , First Publish Date - 2020-11-26T06:14:32+05:30 IST

కందిపంటను పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి

కందిపంటను పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి
రాజబొల్లారంలో కంది పంటను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి మేరీ రేఖ

మేడ్చల్‌ రూరల్‌: మండలంలోని రాజబొల్లారం, అక్బర్జాపేట గ్రామాల్లో గల కంది పంటను బుధవారం జిల్లా వ్యవసాయాధికారి మేరీరేఖ పరిశీలించారు. ప్రస్తుతం కంది పంటలో మచ్చల పురుగు, శనగ పచ్చ పురుగును గుర్తించినట్లు తెలిపారు. తెల్లరెక్కల పురుగు పూల మొగ్గలపై, లేత ఆకులు, పిందెలపై గడ్లు పెడుతుందని చెప్పారు. వాటి నుంచి వెలువడిన లార్వాలు ఆకులను, పూలను, కాయలను కలిపి గూడుగా చేసి మొగ్గలు, పిందెలు, కాయలను తొలిచి తింటాయని తెలిపారు. దీనివల్ల ముడతలు కనిపిస్తున్నాయన్నారు. పూతదశలో పొగమంచు, అడపాదడపా చిరుజల్లులు కురిసినప్పుడు పరుగుకు అనుకూల పరిస్థితులుంటాన్నారు. వ్యవసాయాధికారులు సూచించిన మందులను వాడి కంది పంటను రక్షించుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం మండలంలోని పూడూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. కార్యక్రమంలో పూడూరు క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణాధికారి విజయ్‌, సొసైటీ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-26T06:14:32+05:30 IST