హైదరాబాద్ గడ్డ.. బీజేపీ అడ్డా..
ABN , First Publish Date - 2020-12-06T04:49:05+05:30 IST
హైదరాబాద్ గడ్డ.. బీజేపీ అడ్డా..

- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సత్యంయాదవ్
- గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై హర్షం
శంషాబాద్‌రూరల్: ఇక నుంచి హైదరాబాద్ గడ్డ.. బీజేపీ అడ్డా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సత్యంయాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో 48 మంది బీజేపీ కార్పొరేటర్లు విజయం విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చెప్పారు. అకాల వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్, మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయే అని చెప్పారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తామన్నారు. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు శ్రమించిన కార్యకర్తలకు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్పొరేటర్లను సన్మానించిన బుక్క వేణుగోపాల్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయం సాధించిన అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత, రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన, మైలార్‌దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివా్‌సరెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి శాలువాలు, పూలమాలతో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్‌కుమార్, ఎన్.కుమార్‌యాదవ్, నర్కూడ సర్పంచ్ సిద్ధులు, బుర్కుంట గోపాల్, బుర్కుంట సంజీవ, మెండే కుమార్‌యాదవ్, అశోక్, కిట్టు, శివ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్లకు నేతల అభినందన
ఆమనగల్లు : చంపాపేట కార్పొరేటర్‌గా గెలుపొందిన బీజేపీ అభ్యర్థి వంగ మధుసూధన్‌రెడ్డిని శనివారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆమనగల్లు మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర నాయకుడు తిప్పిరెడ్డి రాంరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద ఆమనగల్లు, మాడ్గుల బీజేపీ నాయకులతో మధుసూధన్‌రెడ్డిని కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. తాను ఇన్‌చార్జిగా వ్యవహరించిన చంపాపేట డివిజన్ కార్పొరేటర్‌గా మధుసూదన్‌రెడ్డి విజయం పట్ల హరిప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, ఏలె రమేశ్, పరమేశ్‌గౌడ్, శ్రీనివా్‌సరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి తదితరులు ఉన్నారు. అదే విధంగా గోల్నాక టీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి లావణ్యశ్రీనివా్‌సగౌడ్ విజయం పట్ల ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. లావణ్యను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎ్‌స్ నాయకులు సీఎల్ శ్రీనివా్‌సయాదవ్, నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, జర్పుల దశరథ్‌నాయక్, గంప వెంకటేశ్, సయ్యద్ ఖలీల్, రాజు, సుభాష్, సతీష్, లచ్చీరాంనాయక్, జోగు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల కృషి అభినందనీయం
షాద్‌నగర్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడానికి షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తల కృషి అభినందనీయమని బీజేపీ షాద్‌నగర్ పట్టణ అధ్యక్షుడు మఠం రుషికేష్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు దక్కించుకోవడం ఆనందం కలిగించిందన్నారు. ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు.
బీజేపీ నాయకుల సంబురాలు
కొత్తూర్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనాతా పార్టీ అభ్యర్థులు విజయం పట్ల స్థానిక నాయకులు శనివారం మండల కేంద్రంలో సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని బాణాసంచా పేల్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అమడపురం నర్సింహగౌడ్, మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నాయకులు బావండ్ల మాణిక్యం, రాఘవులు, సుధాకర్, కుమార్, ప్రతా్‌పరెడ్డి, రణధీర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనే..
షాబాద్ : టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధానకార్యదర్శి శ్రవణ్‌కుమార్, ఉపాధ్యక్షులు రవికుమార్‌చారి, నాయకులు యాదయ్య, మహేష్, సత్యనారాయణ, హరీష్, రాజ్‌కుమార్, సురేష్, ప్రవీన్‌కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్‌లో బీజేపీ నాయకుల సంబరాలు
శంషాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల శంషాబాద్‌లో శనివారం పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకు న్నాయి. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నందకిషోర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో కొనమొల్ల దేవేందర్, ప్రశాంత్, భాస్కర్‌రెడ్డి, అశోక్‌కుమార్, సుఖేందర్‌రెడ్డి, శ్రవణ్, బండి శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.