-
-
Home » Telangana » Rangareddy » Actions if the rules are violated
-
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-12-31T05:07:36+05:30 IST
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

- ఇళ్లల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి
- ఎస్పీ నారాయణ
వికారాబాద్ : కోవిడ్-19 నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఎం.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31న అర్థరాత్రి రోడ్లపై వేడుకలు, డీజేలు, సౌండ్‌బాక్సులకు అనుమతులు లేవన్నారు. రిసార్ట్, ఫాంహౌ్‌సలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అర్ధరాత్రి బైక్‌ర్యాలీ తదితర వాహన నియమ నిబంధనలు పాటించని వారి వాహనాలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వేడుకలు తమ ఇళ్లలోనే కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ఆయన కోరారు. జిల్లా ప్రజలకు, పోలీసు తదితర శాఖల అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లాలో పెరిగిన కేసులు
వికారాబాద్ జిల్లాలో గత సంవత్సరం 2019తో పోలిస్తే 2020 సంవత్సరంలో కొంత మేర నేరాలు పెరిగినట్లు ఎస్పీ నారాయణ తెలిపారు. నవంబర్ 2020 నాటికి నమోదైన కేసుల వివరాలను బుధవారం వెల్లడించారు. లాభం కోసం హత్యలు గత సంవత్సరంలో 1, ప్రస్తుతం 4, డెకాయిటీ గతంలో 0, ప్రస్తుతం 1, దోపిడీలు గతంలో 2, ప్రస్తుతం 1, దొంగతనాలు గతంలో 111, ప్రస్తుతం 121, హత్యలు గతంలో 34, ప్రస్తుతం 31, అల్లర్లు గతంలో 7, ప్రస్తుతం 6, కిడ్నా్‌్‌పలు గతంలో 29, ప్రస్తుతం 38, అత్యాచారాలు గతంలో 53, ప్రస్తుతం 59, హత్యా యత్నాలు గతంలో 29, ప్రస్తుతం 30 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. మొత్తంగా గత సంవత్సరం 3,416 కేసులు నమోదవగా 2020 నవంబర్ నాటికి 3,708 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.