గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-12-13T05:30:00+05:30 IST
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

ఘట్‌కేసర్ రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధి జోడిమెట్ల సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రీ జిల్లా, భువనగిరికి చెందిన చిట్టిమల్ల నరేష్(25) తన ద్విచక్రవాహనంపై బోడుప్పల్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తిరిగి భువనగిరికి వస్తుండగా జోడిమెట్ల సమీపానికి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నరేష్ తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.