ఆగిఉన్న లారీని ఢీకొన్న మరో లారీ

ABN , First Publish Date - 2020-12-26T04:07:27+05:30 IST

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన

ఆగిఉన్న లారీని ఢీకొన్న మరో లారీ
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు

  • ఇద్దరి దుర్మరణం


శంకర్‌పల్లి : ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన శంకర్‌పల్లి మండలం ఎల్వర్తి గ్రామ శివారులోని శంకర్‌పల్లి-చేవెళ్ల రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్వర్తిశివారులో లారీ(కేఏ37 ఏ9289)ని రోడ్డు పక్కన నిలిపారు. మహారాష్ట్ర నుంచి కంది ధాన్యంతో వస్తున్న లారీ(ఎంహెచ్‌24 ఏయూ2559) డ్రైవర్‌ సికిందర్‌సింగ్‌(34) నిద్రమత్తులో నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో సికిందర్‌తో పాటు క్లీనర్‌ అలీఖాన్‌ పఠాన్‌(30) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ మహారాష్ట్రలోని లాతూర్‌ ప్రాం తానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గోపినాథ్‌ తెలిపారు.Updated Date - 2020-12-26T04:07:27+05:30 IST