లారీ బోల్తా.. ఏడుగురికి గాయాలు
ABN , First Publish Date - 2020-12-12T04:59:18+05:30 IST
లారీ బోల్తా.. ఏడుగురికి గాయాలు
కడ్తాల : కడ్తాల మండల కేంద్రానికి సమీపంలోని ముచ్చర్లగేటు వద్ద శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ సుందరయ్య వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచలూరు గ్రామం నుంచి బూడిదపొట్టు లోడ్‌తో తుక్కుగూడ వైపు వెళ్తున్న లారీ ముచ్చర్లగేటు సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బాల్‌రెడ్డితో పాటు లారీలో ఉన్న కార్మికులు కిషోర్, బసంత్, భజన్, గోవింద్, రుమాన్, వాసులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.