పల్లె ప్రకృతి వనాల పనుల్లో వేగం పెంచండి

ABN , First Publish Date - 2020-08-18T10:11:24+05:30 IST

పల్లె ప్రకృతి వనాల పనుల్లో వేగం పెంచండి

పల్లె ప్రకృతి వనాల పనుల్లో వేగం పెంచండి

 జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. సోమవారం జడ్పీ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వనాలు, శ్మశానవాటికల పనుల పురోగతిపై ఆమె అధికారులతో సమీక్షించారు. మండలాల వారీగా పల్లె ప్రగతి ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయాలని తెలిపారు.


హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలిపారు. కొవిడ్‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో జానకిరెడ్డి, ఎంపీడీవోలు సత్తయ్య, హరీష్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


పల్లెప్రకృతివనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టండి

మంచాల : పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం మండలంలో పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. బోడకొండ, సత్యంతండా, బండలేమూర్‌ తదితర గ్రామాల్లోని రైతువేదికలు, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్‌నర్మద, వైస్‌ఎంపీపీ రాజేశ్వరి, ఎంపీడీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ దేవ్‌జా, సర్పంచలు అనిత, మంగ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-18T10:11:24+05:30 IST