యువతను తీర్చిదిద్దేందుకు ఏబీవీపీ కృషి

ABN , First Publish Date - 2020-12-29T04:52:03+05:30 IST

యువతను తీర్చిదిద్దేందుకు ఏబీవీపీ కృషి

యువతను తీర్చిదిద్దేందుకు ఏబీవీపీ కృషి
కందుకూరు నగర నూతన కమిటి సభ్యులతో కందడి శ్రీరామ్‌

  • సంఘం రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు కందడి శ్రీరామ్‌

కందుకూరు: దేశభక్తిని పెంపొందిస్తూ యువతను ఆరద ర్శంగా తీర్చిదిద్దడానికి ఏబీవీపీ కృషిచేస్తుందని సంఘం రాష్ట్ర వర్కింగ్‌ కమిటి సభ్యుడు కందడి శ్రీరామ్‌ పేర్కొన్నారు. సోమవారం కందుకూరులో సంఘం సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జ్ఞానం, శీలం, ఏక్తా అనే సిద్ధాంతాలతో వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా.. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ సంఘం పనిచేస్తుందన్నారు. అనంతరం సంఘం నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు శ్రీరామ్‌ ప్రకటించారు. కార్యదర్శిగా అయిళ్ల దినేష్‌, ఉపాధ్యక్షులుగా జి.విజయేందర్‌, పి.ప్రశాంత్‌, మర్రి ప్రవీణ్‌రెడ్డి, ఢిల్లీ రాజు, సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌.రాఖేష్‌, యు.సంతో్‌షరెడ్డి, ఎన్‌.వంశీ, అనే గౌని సాయికిరణ్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా టి.మణికుమార్‌, ఎస్‌ఎ్‌ఫడీ కన్వీనర్‌గా జి.వంశీ, మీడియా కన్వీనర్‌గా తరుణ్‌, హాస్టళ్ల ఇన్‌చార్జిగా ఒగ్గు రాజేష్‌, క్రీడల కన్వీనర్‌ శివప్రసాద్‌, పాఠశాల ఇన్‌చార్జి డి.అరుణ్‌, కళాశాల ఇన్‌చార్జిగా అజయ్‌, కార్యవర్గ సభ్యులుగా ఎం.కుమార్‌, కె.వినయ్‌, ఎడ్ల సిద్దు, టి.ఆనంద్‌, శివప్రసాద్‌లను ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యవర్గ సభ్యులు ఢిల్లీ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T04:52:03+05:30 IST