ఎవరీ తల్లి?

ABN , First Publish Date - 2020-03-15T06:08:03+05:30 IST

దయలేని సంతానం తల్లిని ఆస్పత్రి ఆవరణలో వదిలేశారు. ఆమె జీవచ్ఛవంలా పడిఉండడం గమనించిన మానవత్వం కలిగిన వ్యక్తులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

ఎవరీ తల్లి?

జిల్లాసుపత్రి ఆవరణలో వదిలివేత

తాండూరు : దయలేని సంతానం తల్లిని ఆస్పత్రి ఆవరణలో వదిలేశారు. ఆమె జీవచ్ఛవంలా పడిఉండడం గమనించిన మానవత్వం కలిగిన వ్యక్తులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఈసంఘటన తాండూరు జిల్లాసుపత్రి వద్ద జరిగింది. వివరాలలోకి వెళితే అనారోగ్యంతో ఉన్న మహిళను గుర్తుతెలియని వ్యక్తులు తాండూరు ప్రభుత్వ జిల్లాసుపత్రి ఆవరణలో వదిలేసి వెల్లిపోయారు. ఆమెను కనీసం ఆస్పత్రిలో కూడా అడ్మిట్‌చేయకుండా వెళ్లిపోయారు.


ఆమె ఆస్పత్రి ఆవరణలో ఎండలో జీవచ్ఛవంలా పడిఉండడం గమనించిన స్థానికులు ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి ఆమెను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయించారు. ఆమె ఎవరు... ఏఊరు అనేవిషయాలు  తెలియడం లేదు. ఆమె మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈ హృదయ విదారక సంఘటనను చూసి స్థానికులు మానవత్వం మంటకలిసిపోతోందని ఆవేదన చెందారు. ఆ తల్లి ఎవరనే విషయమై  చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2020-03-15T06:08:03+05:30 IST