-
-
Home » Telangana » Rangareddy » aasha demands
-
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-10T05:30:00+05:30 IST
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటలను కలిసిన ఆశావర్కర్లు
మేడ్చల్: ఆశావర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం, టీఆర్‌ఎ్‌సకేవీ అనుబంధ రాష్ట్ర కమిటీ సభ్యులు టీఆర్‌ఎ్‌సకేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌లు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పూడూరు పరిధిలో గల ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఆయన నివాసంలో వారు గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశావర్కర్లకు ఆన్‌లైన్‌లో ఇన్‌సైడ్ వేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్లు ఆందోళనకు గురవుతున్నారని మంత్రికి వివరించారు. అలాగే అర్హులైన ఆశావర్కర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని ఆశా రికార్డ్స్ ప్రభుత్వం ముద్రించి ఇవ్వాలన్నారు. దేశ కార్యక్రమాలు ఇన్సెంటీవ్ ఫార్మాట్ నుంచి తొలగించాలని ముఖ్యంగా కర్ణాటకలో సకాలంలో గ్రౌండ్ లెవల్‌లో చాలా కష్టపడి పనిచేసిన వర్కర్లకు ఫిక్సిడ్‌గా రూ.7500 ప్రతీ అశావర్కర్‌కు అకౌంట్‌కు ప్రతినెలా ఐదో తారీఖులోపు జమచేయాలని మంత్రిని కోరారు. ఆశావర్కర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి రూ.15000 పర్మినెంట్ వేతనంగా ఇచ్చే విధంగా చేయాలని మంత్రిని కోరారు. రూ.7500 ఆశావర్కర్ల అకౌంట్‌లో జమ అవుతాయని, త్వరలో ఆశావర్కర్లకు అవసరమైన ట్రేనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగతా సమస్యల గురించి సీఎంతో చర్చిస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల సంతోష్, ఉపాధ్యక్షురాలు కరుణ, సమత, అపర్ణ, శోభ, మహాలక్ష్మీ, పద్మ, లక్ష్మీ, రాణి, ఆశావర్కర్లు తదతరులు పాల్గొన్నారు.
మహాపడిపూజలో పాల్గొన్న మంత్రి
మండలంలోని పూడూరు గ్రామ పరిధిలో గల హరిహర నందన అయ్యప్ప ఆలయంలో గురువారం నిర్వహించిన అయ్యప్ప మహాపడి పూజ కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.