నిరాడంబరంగా బోనాల పండుగ

ABN , First Publish Date - 2020-07-20T10:19:45+05:30 IST

ఆషాఢ మాసంలో చివరి ఆదివారం బోనాల పండుగను చేవెళ్ల డివిజన్‌లో చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర

నిరాడంబరంగా బోనాల పండుగ

చేవెళ్ల/షాబాద్‌/శంకర్‌పల్లి/మొయినాబాద్‌రూరల్‌/ ఇబ్రహీంపట్నం/ మేడ్చల్‌/ ఘట్‌కేసర్‌/ శామీర్‌పేట్‌/ తాండూరు: ఆషాఢ మాసంలో చివరి ఆదివారం బోనాల పండుగను చేవెళ్ల డివిజన్‌లో చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు  భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ,  మైసమ్మ, ఎల్లమ్మ, ఊరడమ్మ, పోలెరెమ్మ తదితర ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనమెత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కరోనా నేపథ్యంలో హంగూ ఆర్భా టాలకు పోకుండా పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామపెద్దలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడులో మహంకాళి బోనాల ఉత్సవాల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌ కుమార్‌రెడ్డి, ఎంపీపీ పి.కృపేష్‌, వైస్‌ఎంపీపీ వెంకటప్రతాప్‌రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మేడ్చల్‌ పట్టణంలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ దీపికనరసింహారెడ్డి పిలుపు మేరకు ప్రజలు ఎవరి ఇళ్లల్లో వారే బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.


ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని ఎన్‌ఎ్‌ఫసీనగర్‌ కాలనీ, బొక్కొనిగూడలో బోనాల పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఎవరికి వారే వెళ్లి నల్లపోచమ్మ, చిత్తారమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. శామీర్‌పేట మండల కేంద్రంలో ఎంపీపీ ఎల్లూబాయి, సర్పంచ్‌ బాలమణి, ఉపసర్పంచ్‌ రమేశ్‌, ఎంపీటీసీ సాయిబాబా, కట్టమైసమ్మ ఆలయ అధ్యక్షుడు శ్రీరాములు గ్రామ దేవత నల్ల పోచమ్మ, దుర్గమ్మ, మహంకాళమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కరోనా కారణంగా ఇళ్ల వద్దే బోనాలను సమర్పించారు. తూంకుంట మున్సిపాలిటీలోని అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ మునిసిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుభాష్‌గౌడ్‌ పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని మాణిక్‌నగర్‌ కట్టమైసమ్మ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కాంగ్రెస్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫ్లోర్‌లీడర్‌ వరాల శ్రీనివా్‌సరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట కమిటీ చైర్మన్‌ వెంకటన్న, పరమేష్‌, నారా శ్రీకాంత్‌ ఉన్నారు.

Updated Date - 2020-07-20T10:19:45+05:30 IST