మన్‌సాన్‌పల్లి వాగుపై తెగిన వంతెన
ABN , First Publish Date - 2020-08-01T10:45:02+05:30 IST
వికారా బాద్ జిల్లాలోని మన్‌సాన్ పల్లి వాగుపై ప్రత్యామ్నా యంగా ఏర్పాటు చేసిన వంతెన తెగిపోయింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి

పెద్దేముల్: వికారా బాద్ జిల్లాలోని మన్‌సాన్ పల్లి వాగుపై ప్రత్యామ్నా యంగా ఏర్పాటు చేసిన వంతెన తెగిపోయింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ప్రత్యామ్నాయ వంతెన తెగిపోవడంతో తాండూరు - హైదరాబాద్ రోడ్డులో రవాణా వ్యవస్థ స్తంభించింది. చుట్టూ తిరిగి ప్రయాణం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. పెద్దేముల్ మండలం మన్‌సాన్‌పల్లి సమీపంలో కాగ్నా వాగు ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్దఎత్తున వాగు పొంగిపొర్లి వాహనాలు నిలిచిపోతుండేవి. దీంతో అధికారులు బ్రిడ్జి ఎత్తును పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
అందుకుగాను రెండేళ్ల క్రితమే టెండర్లు కూడా పూర్తయ్యాయి. కానీ పనులు చేయించడంలో అధికా రులు విఫలమయ్యారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు. చివరకు 3నెలల క్రితం బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించారు. పాతబ్రిడ్జిని తొలగించి దాని పక్కనుంచి వాగులో పైపులు, మట్టివేసి తాత్కాలికంగా వంతెన నిర్మించారు. అది గురువారం కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున వాగులో వరదనీరు ప్రవహించడంతో తెగిపోయింది. పైపులు కొట్టుకుపోయాయి. తెల్లవారుజాము నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభం కావడంతో తాత్కాలిక వంతెన తెగిన విషయం తెలియక వాహనదారులు అక్కడి వరకు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. సుమారు 20 కి.మీ పైగా అధిక ప్రయాణం చేయాల్సి వస్తోంది.