తాండూరు మండలంలో 90శాతం సర్వే పూర్తి

ABN , First Publish Date - 2020-10-19T09:18:50+05:30 IST

తాండూరు మండల పరిధిలోని 33 గ్రామపంచాయతీల్లో 90శాతం సర్వే పూర్తయినట్లు తాండూరు ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

తాండూరు మండలంలో 90శాతం సర్వే పూర్తి

తాండూరు రూరల్‌ : తాండూరు మండల పరిధిలోని 33 గ్రామపంచాయతీల్లో 90శాతం సర్వే పూర్తయినట్లు తాండూరు ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలో 53,661 జనాభాకు గాను 15,804 గృహాలు ఉన్నాయని, వీటిలో 14,808 గృహాల్లో సర్వే పూర్తయినట్లు పేర్కొన్నారు. మరో 41 ఇళ్ల సర్వే పూర్తికాలేదని, 955 గృహాలను సర్వే చేయాల్సి ఉందని తెలిపారు. 6కోర్టు కేసులు ఉన్నాయని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో నూరుశాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.


Updated Date - 2020-10-19T09:18:50+05:30 IST