కరోనా ఉగ్రరూపం

ABN , First Publish Date - 2020-07-28T09:52:50+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగటం లేదు. రోజురోజుకూ మహమ్మారి ఉధృతమవుతోంది.

కరోనా ఉగ్రరూపం

ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 855 పాజిటివ్‌లు

అత్యధికంగా రంగారెడ్డిలో 485, వికారాబాద్‌లో 15 కేసులు

మేడ్చల్‌లో 355 కేసులు నమోదు, ఒకరి మృతి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగటం లేదు. రోజురోజుకూ మహమ్మారి ఉధృతమవుతోంది. సోమవారం ఒక్కరోజే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 855 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 485 నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీలో 334 కేసులు నమోదు కాగా, నాన్‌ జీహెచ్‌ఎంసీలో 151 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 355 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. వికారాబాద్‌ జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 20,248కి చేరుకుంది.


ఉమ్మడి జల్లాలో 20 వేలు దాటిన కేసులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 వేలు దాటాయి. రంగారెడ్డి జిల్లాలో 10 వేల కేసులు దాటి పోగా మేడ్చల్‌ జిల్లాలో పది వేలకు చేరువలో ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లాలో కేవలం 388 కేసులే నమోదయ్యాయి. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో...

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో 44 మందికి పాజిటివ్‌ వచ్చింది. అందులో షాద్‌నగర్‌కు చెందిన వారు 23మంది ఉండగా.. కొత్తూర్‌, కేశంపేట, కొందుర్గు, ఫరూఖ్‌ నగర్‌ మండలాలకు చెందినవారు 21మంది ఉన్నారు.


ఆమనగల్లులో 12 కేసులు

ఆమనగల్లు : ఆమనగల్లు పట్ట ణంలోని ప్రభుత్వాసుపత్రి, ప్రజ్వల మహిళ పునరావాస కేంద్రంలో 124మందికి కరోనా పరీ క్షలు చేయగా 12మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో ఆమనగల్లుకు చెందినవారు ఏడుగురు, కడ్తాల మండలం ముద్విన్‌కు చెందిన వారు ముగ్గురు, కొత్తపేటకు చెందిన ఇద్దరు ఉన్నారు. 


కందుకూరులో ఇద్దరికి కరోనా

కందుకూరు : కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సోమ వారం 49మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారు కందుకూరు మండల కేంద్రానికి చెందిన వారుగా వైద్యాధికారులు నిర్దారించారు. 


పట్నం డివిజన్‌లో 41 పాజిటివ్‌ కేసులు

యాచారం/ ఇబ్రహీంపట్నం/ మంచాల : ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని పలు ఆసుపత్రుల్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో 41 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ అభిరాం తెలిపారు. ఇబ్రహీంపట్నం సీహెచ్‌ఎన్‌సీతోపాటు మంచాల, ఆర్టుట్ల, యాచారం, మాడ్గుల, అబ్ధుల్లాపూర్‌మెట్‌ పీహెచ్‌సీల్లో మొత్తం 192 మందికి పరీక్షలు నిర్వహించారు. 


యాచారం మండలకేంద్రంలో..

యాచారం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి నాగజ్యోతి చెప్పారు. తాడిపర్తిలో ఒకరు, తమ్మలోనిగూడలో ఒకరు. ఇబ్రహీంపట్నం టౌన్‌లో  ఇద్దరు, మంచాలలో ఒకరికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. వారందరినీ హోంక్వానంటైన్‌ చేశామన్నారు. 


వికారాబాద్‌ జిల్లాలో మరో 15 పాజిటివ్‌ కేసులు 

వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో 10 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వికారాబాద్‌లో 2, మోమిన్‌పేట్‌, కులకచర్ల, పెద్దేముల్‌ మండలం, తట్టేపల్లిలో ఒక్కో కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 389 చేరింది. 


బ్యాంకు ఉద్యోగికి కరోనా?

యాలాల : బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెను హోంక్వారంటైన్‌ చేశారు. తాండూరు పట్టణానికి చెందిన మహిళ (27) యాలాల మండలం రాస్నంలోని ఓ బ్యాంకులో విధులు నిర్వహిస్తుంది. తోటి ఉద్యోగులు ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వైద్యులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను హోంక్వారంటైన్‌కు పంపించారు. బ్యాంకు చుట్టూ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 


కరోనాతో వృద్ధురాలి మృతి

మేడ్చల్‌ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ సుతారి గూడకు చెందిన వృద్ధురాలు (65) కరోనాతో సోమవారం మృతి చెందింది. దీంతో గ్రామశివారులో పీపీఈ కిట్లు ధరించిన కొంత మంది మాత్రమే వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2020-07-28T09:52:50+05:30 IST