పారిశుధ్య కార్మికులకు రూ.5వేలు

ABN , First Publish Date - 2020-04-08T09:55:41+05:30 IST

పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల బ్యాంకు ఖాతాలను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌

పారిశుధ్య కార్మికులకు రూ.5వేలు

మేడ్చల్‌ అర్బన్‌: పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల బ్యాంకు ఖాతాలను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్‌లో మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణలో పారిశుధ్య కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని కొనియాడారు. అందుకే ప్రతి కార్మికుడికి రూ.5వేలు అందజేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. జిల్లాలో 61 పంచాయతీల్లో 777 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, వార బ్యాంకు ఖాతాల వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని అధికారులు ఆయన ఆదేశించారు.

Updated Date - 2020-04-08T09:55:41+05:30 IST