ఆగని మరణమృదంగం

ABN , First Publish Date - 2020-09-25T10:01:21+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనాతో 12మంది మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. మేడ్చల్‌ జిల్లాలో

ఆగని మరణమృదంగం

ఉమ్మడి జిల్లాలో 12 మంది మృతి 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనాతో 12మంది మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. మేడ్చల్‌ జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. రోజురోజుకూ ప్రకటించాల్సిన మరణాల సంఖ్యను వారం రోజులకోసారి ప్రకటిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో గురువారం ఒక్కరోజే ఐదుగురు కరోనాకు బలైనట్లు అధికారులు వెల్లడిం చా రు. ఇందులో జీహెచ్‌ఎంసీలో ఒకరు, నాన్‌జీహెచ్‌ఎంసీలో నలుగురు న్నారు. మూడుజిల్లాల్లో ఇప్పటివరకు చనిపోయిన వారిసంఖ్య 251కి చేరుకుంది. 


ఉమ్మడి జిల్లాలో గురువారం 989 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 458, మేడ్చల్‌ జిల్లాలో 500, వికారాబాద్‌ జిల్లాలో 31 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో...

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 457 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 80 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో 64 మందికి పరీక్షలు నిర్వహించగా 14, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 31 మందికిగాను 7, యాచారంలో 32 మందికిగాను 8, దండుమైలారంలో 49 మందికిగాను 6, ఎలిమినేడులో 35 మందికిగాను 14, మంచాలలో 41 మందికిగాను 2, ఆరుట్లలో 32 మందికిగాను 4, మాడ్గులలో 41 మందికిగాను 1, సీహెచ్‌సీ హయత్‌నగర్‌లో 50 మందికిగాను 11, తట్టిఅన్నారంలో 32 మందికిగాను 6, రాగన్నగూడలో 50 మందికిగాను ఏడుగురికి పాజిటివ్‌ అని తేలింది. ఇబ్రహీంపట్నం టౌన్‌కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి (54) గురువారం కరోనాతో మృతిచెందాడు. ఇబ్రహీంపట్నం డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న ఇతనికి కరోనా పాజిటివ్‌తో హోంక్వారంటైన్‌లో ఉన్నాడు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రెండు రోజుల క్రితం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.


కందుకూరు, శంషాబాద్‌లో...

కందుకూరు / శంషాబాద్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 58మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. శంషాబాద్‌ మున్సిపాలిటీలో 63మందికి కరోనా పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింద. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 282 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 27 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో షాద్‌నగర్‌కు చెందిన నలుగురు, కొత్తూర్‌ మండలానికి చెందిన 10మంది, కొందుర్గు మండలానికి చెందిన ఏడుగురు ఉన్నారు. మిగతా ఆరుగురు ఇతర మండలాలకు చెందినవారున్నారు.


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 262 మందికి కరోనా పరీక్షలు చేయగా 22మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 30 మందికి పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 65 పరీక్షలు చేయగా 1, శంకర్‌పల్లి మండలంలో 70 మందికిగాను 7, మొయినాబాద్‌ మండలంలో 35 మందికిగాను 7, షాబాద్‌ మండలంలో 62 మందికిగాను ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది.


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. గురువారం వికారాబాద్‌లో 6, తాండూరులో 9, దౌల్తాబాద్‌లో 3, బషీరాబాద్‌, పూడూరు, యాలాల్‌, కొడంగల్‌ మండలాలల్లో రెండు చొప్పున, మర్పల్లి, పరిగి, దోమ, కుల్కచర్ల, కోట్‌పల్లి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


దామర్‌చెడ్‌లో కరోనా టెస్టులు 

బషీరాబాద్‌: మండలంలోని దామర్‌చెడ్‌ ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షల క్యాంపును నిర్వహించారు. 50 మందికి కరోనా పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది. 


కులకచర్ల, పరిగి పరిధిలో..

కులకచర్ల/పరిగి : కులకచర్లలో 29 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. చెల్లాపూర్‌లో 3, కులకచర్లలో ఒకటి, కోస్గిలో రెండు, దోమ, మరికల్‌లో ఒకటి చొప్పున నమోదయ్యాయి. పరిగిలో  24 మంది పరీక్షలు నిర్వహించగా గంజ్‌రోడ్‌లో ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. 


కొనసాగుతున్న కరోనా పరీక్షలు

కొడంగల్‌: కొడంగల్‌ మున్సిపాలిటీపాటు అంగడిరైచూర్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌ పీహెచ్‌సీల పరిధిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. రుద్రారంలో 75మందికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌గా వచ్చింది. 


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో గురువారం 76 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 32 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటీవ్‌ వచ్చింది.

Updated Date - 2020-09-25T10:01:21+05:30 IST