అందరికీ అందేలా 108 సేవలు.. అధికారులు ప్రశంసలు

ABN , First Publish Date - 2020-12-11T05:47:19+05:30 IST

అందరికీ అందేలా 108 సేవలు.. అధికారులు ప్రశంసలు

అందరికీ అందేలా 108 సేవలు.. అధికారులు ప్రశంసలు
జీవీకే-ఈఎంఆర్‌ఐ కేంద్రాన్ని సందర్శించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు

శామీర్‌పేట : ప్రభుత్వం అందించే 108, 100 సేవలను జీవీకే సంస్థ వారు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ప్రశంసించారు. గురువారం శామీర్‌పేటమండలం దేవర్‌ యాంజాల్‌ పరిధిలోని జీవీకే-ఈఎంఆర్‌ఐ కేంద్రాన్ని వారు సందర్శించారు. అంబు లెన్స్‌ సేవలను అధికారులు వారికి వివరించారు. కార్యక్రమంలో సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ప్రభుత్వకార్యదర్శి, ట్రైబల్‌వెల్ఫేర్‌ కమిషనర్‌ క్రిస్టియన్‌జడ్‌ చోతాంగు, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగితారాణా, పబ్లిక్‌ హెల్త్‌, ఫ్యామిలీవెల్ఫేర్‌ కమిషనర్‌ వాకాటి కరుణ, సీఎం ఓఎస్‌డీ ప్రియాంకావర్గీస్‌, మహిళా, శిశు సంక్షేమ, ఎస్పీ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ దివ్య, డీఐజీ బడుగుల సుమతి, కలెక్టర్‌ శ్వేతా మహంతి, తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2020-12-11T05:47:19+05:30 IST