విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-12-31T05:17:46+05:30 IST
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మంగ్లూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
నిజాంసాగర్, డిసెంబరు 30: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మంగ్లూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుం బ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మే కల కోసం కొమ్మలను తీసుకురావడానికి రంజిత్ గౌడ్ (18) వెళ్లాడు. కొమ్మలు కోస్తుండగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి. దంతో కరెంట్ షాక్ రావడంతో చెట్టుపై నే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై హైమద్ పరిశీలించారు. మృతుడి తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించారు.