వాహనం ఢీకొని యువతి మృతి

ABN , First Publish Date - 2020-12-14T04:36:45+05:30 IST

రూరల్‌ పోలీసులు స్టేషన్‌ పరిధిలోని ఖానాపూర్‌ బైపాస్‌ వద్ద బుల్లెట్‌ ఢీకొని అఫ్సియా జుబాన్‌ సుల్తానా (22) అనే యువతి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని అఫ్సియా జుబాన్‌ సుల్తానా తన కుటుంబంతోపాటు చంద్రశేఖర్‌ కాలనీలో నివసిస్తోంది. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు జిమ్‌కు వెళ్తుంది.

వాహనం ఢీకొని యువతి మృతి
వివరాలు నమోదు చేసుకుంటున్న పోలీసులు

నిజామాబాద్‌ రూరల్‌, డిసెంబరు 13: రూరల్‌ పోలీసులు స్టేషన్‌ పరిధిలోని ఖానాపూర్‌ బైపాస్‌ వద్ద బుల్లెట్‌ ఢీకొని అఫ్సియా జుబాన్‌ సుల్తానా (22) అనే యువతి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని అఫ్సియా జుబాన్‌ సుల్తానా తన కుటుంబంతోపాటు చంద్రశేఖర్‌ కాలనీలో నివసిస్తోంది. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు జిమ్‌కు వెళ్తుంది.  ఆది వారం ఉదయం 6 గంటలకు ఎప్పటి మాదిరిగానే తన ఆక్టివా వాహనంపై చంద్రశేఖర్‌ కాలనీ నుంచి వెళ్తుంది.ఖానాపూర్‌ బైపాస్‌ వద్ద నూతన కలెక్టరేట్‌ ఎదురుగా వేగంగా వచ్చిన బుల్లెట్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. టీఎస్‌ 09 ఎఫ్‌ఎల్‌ 0650 నెంబర్‌ గల బుల్లెట్‌ను మహ్మద్‌ అబ్దుల్‌ సలామ్‌ అనే వ్యక్తి తన బుల్లెట్‌పై కంఠేశ్వర్‌ నుంచి అర్సపల్లి వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సలామ్‌కు సైతం గా యాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Updated Date - 2020-12-14T04:36:45+05:30 IST