పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-12-30T05:17:00+05:30 IST
ఉపాధి హామీ పథకంలో చేపట్టి న పనులను త్వరగా పూర్తి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయ ణ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 29: ఉపాధి హామీ పథకంలో చేపట్టి న పనులను త్వరగా పూర్తి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయ ణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడి యో కాన్ఫరెన్సు ద్వారా నర్సరీలు, హరితహారం, క్రిమిటోరియం, ఉపాధిహామీ పథకం తదితర వాటిపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. క్రి మిటోరియంలు మంజూరైనవి 530, పూర్తి అయినవి 473, పెండింగ్‌లో ఉ న్నవి 53 మాత్రమే అని అన్నారు. పూర్తి అయిన పనులకు ఇప్పటి వరకూ రూ.263.99 లక్షలు చెల్లించామని తెలిపారు. జిల్లా పేమెంట్‌లో రాష్ట్రంలోనే రెండోదని, డబ్బులు చెల్లింపులు త్వరగా పూర్తి కావాలని సూచించారు. జ నవరి 19వ తేదీ వరకు జిల్లాలో పల్లె ప్రకృతి పనులు పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైయింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు మొ త్తం జిల్లాకు 3,411 మంజూరు కాగా, ఇప్పటి వరకు 927 పూర్తి అయినట్లు చెప్పారు. వీటికి సంబంధించి రూ.263.99 లక్షలు చెల్లించనట్లు చెప్పారు. నర్సరీల విషయంలో ప్రతీ పంచాయతీ కార్యదర్శి ప్రణాళిక ప్రకారం ముం దుకు వెళ్లాలని సూచించారు. ప్రతీ జీపీలో సాయిల్ బ్యాగ్‌లు అన్ని ఫిల్ చేయాలని, వారంలోగా సీడ్ ఫిల్లింగ్ పూర్తి కావాలని సూచించారు. విధు ల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వర్ని పంచాయతీ కార్యదర్శి, ఏపీవోపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉం దని తెలిపారు. రోడ్డు పక్కన ప్రతీ ఐదు మీటర్లకు ఒకటి చొప్పున మొక్క నాటాలని అన్నారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను కా పాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. నర్సరీ నిర్వహణలో ఏ మైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో జరిగిన ప్రతీ పనికి బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపా రు. పంచాయతీ కార్యదర్శులకు గ్రామాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి ఏడు రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని తెలిపారు. గ్రామ సభల తీర్మానాలు లేకుండా పనులు చే యడం నిబంధలనకు విరుద్ధమన్నారు. ఉపాధి హామీ కూలీల శాతం పెరగడం లేదని, ప్రతీ సమావేశాల్లో చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపా రు. ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా పనులు ఎంపిక చేయాలని, ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లత, డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.