పనులు చేయడానికి కూలీలు తరలి రావాలి
ABN , First Publish Date - 2020-12-02T04:31:23+05:30 IST
మహాత్మా గాంధీ జాతీయ ఉఫాధి హామీ పథకంలో పనులు కల్పిస్తామని, కూలీలు అధక సం ఖలో తరలిరావాలని మండల ప్రత్యేక అధి కారి, జిల్లా సహకార శాఖ అధికారి సింహా చలం కోరారు.

సిరికొండ, డిసెంబరు 1 : మహాత్మా గాంధీ జాతీయ ఉఫాధి హామీ పథకంలో పనులు కల్పిస్తామని, కూలీలు అధక సం ఖలో తరలిరావాలని మండల ప్రత్యేక అధి కారి, జిల్లా సహకార శాఖ అధికారి సింహా చలం కోరారు. సిరికొండలో మంగళవారం సర్పంచ్ ఎన్నం రాజరెడ్డి అధ్యక్షతన జరి గిన గ్రామ సభకు సింహాచలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమయం లో కూలీలకు ఉపాధి లభించదన్నారు. ఉపాధి లేని స మయంలో కూలీలకు పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్ర భుత్వం పంట కాలువలు, చెరువుల్లో వరద నీళ్లు వచ్చే కాలువల తవ్వకాలను చేపడుతుందని తెలిపారు. నూతన కాలనీల్లో మట్టి రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నందున కూలీలు అధిక సంఖ్యలో పనుల్లోకి రావాలని కోరారు. .ఇంకుడు గుంతలు తవ్వుకుంటే ప్రభుత్వం రూ.నాలుగు వేలు మంజూరు చేస్తుందన్నారు. అంతకు మందు సర్పం చ్ ఎన్నం రాజరెడ్డి మాట్లాడుతూ పనులు చేయడానికి కూలీలు వస్తున్న వారికి మాత్రం డబ్బులు రావడం లేదని, పనులు చేయని వారికి కూలీ డబ్బులు వస్తున్నాయని తె లిపారు. ఇక నుంచి అలా జరగకుండా చూస్తామని అధికా రి అన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులలో ఎవరికైతే డ బ్బులు రాలేవని అంటున్నారో వారు తమ దృష్టికి తీసు కొస్తే విచారణ చేయిస్తానన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఫీల్డ్ అధికారి, ఎన్‌ఆర్‌జీఎస్ ఏపీవో సుధాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఏఈవో శ్రీకాంత్, నీటిపారుదల శాఖ వర్క్‌ఇన్‌స్పెక్టర్ మోహన్, వార్డు సభ్యు లు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.