రైతాంగ అభివృద్ధికి కృషిచేస్తా

ABN , First Publish Date - 2020-03-13T12:17:17+05:30 IST

రైతులకు అనుక్ష ణం అందుబాటులో ఉండి సేవలు అందిస్తా నని, రైతాంగ అభివృద్ధికి కృషిచేస్తానని డీసీ సీబీ

రైతాంగ అభివృద్ధికి కృషిచేస్తా

డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి 


బీర్కూర్‌, మార్చి 12: రైతులకు అనుక్ష ణం అందుబాటులో ఉండి సేవలు అందిస్తా నని, రైతాంగ అభివృద్ధికి కృషిచేస్తానని డీసీ సీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం బీర్కూర్‌ మండలం బైరాపూర్‌ గ్రామంలోని రుక్మిణి విఠలేశ్వరాలయంలో స ప్తాహ ముగింపు కార్యక్రమంలో ఆయన పా ల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, యువకులు భాస్కర్‌రెడ్డికి ఘన స్వాగతం ప లికారు. ఆలయ అర్చకులు భాస్కర్‌రెడ్డిని పూ ర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. రు క్మిణి విఠలేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం ఆయ న సప్తాహ కార్యక్రమంలో పాల్గొని వార్కారీ లతో కలిసి తాళాలు వేస్తూ భజనలు చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీ సీబీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్ట మొదటగా బైరాపూర్‌ రుక్మి ణి విఠలేశ్వరాలయానికి రావడం స్వామి, అ మ్మవార్లను దర్శించుకోవడం సంతోషంగా ఉం దన్నారు. అనంతరం ఆలయ సన్నిధిలో నూ తనంగా నిర్మించిన విశ్రాంతి భవనాన్ని ఆ యన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్‌, జడ్పీటీసీ స్వరూప, ఎంపీపీ రఘు, నస్రుల్లాబాద్‌ వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, మండల ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు ద్రోణవల్లి అశోక్‌, నాయకులు వెంక ట్‌ రాంరెడ్డి, ఎజాస్‌, భక్తులు తదితరులున్నారు. 

Updated Date - 2020-03-13T12:17:17+05:30 IST