మహిళల సహనం గొప్పది

ABN , First Publish Date - 2020-03-08T11:40:22+05:30 IST

మహిళలకు ఉన్న ఓపిక, సహనం గొప్పదని వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని డీసీసీబీ చైర్మన్‌

మహిళల సహనం గొప్పది

డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి


నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 7 : మహిళలకు ఉన్న ఓపిక, సహనం గొప్పదని వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం డీసీసీబీ కార్యాలయంలో నాబార్డ్‌ ఆధ్వర్యం లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవా నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రం గాల్లో రాణించాలని వారిని ప్రోత్సహించాల్సిన బాధ్య త తల్లిదండ్రులు, భర్తలదేనన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌, డీసీసీబీ అధికారులు, డైరక ్టర్లు, పాల్గొన్నారు. అంతకు ముందు డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వచ్చిన చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి తన ఛాంబర్‌  ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని అధికారులతో చర్చించారు. 


కలెక్టర్‌ను కలిసిన  చైర్మన్‌, డైరక్టర్లు..

 డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికై న అనంతరం తొలిసారిగా క లెక్టర్‌ సి.నారయణరెడ్డిని చై ర్మన్‌ భాస్కర్‌రెడ్డి, డైరక్టర్లు శ నివారం మర్యాద పూర్వ కంగా కలిశారు. ఉమ్మడి జి ల్లాకు చెందిన డైరక్టర్లు, బా న్సువాడ నియోజకవర్గ ప్యా క్స్‌ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి నాయకులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉ న్నారు. 

Updated Date - 2020-03-08T11:40:22+05:30 IST